108 దినముల ఆత్మగాయత్రి సాధన
సాధన ప్రారంభం : September 21
48 దినముల ఆత్మగాయత్రి నోము
సాధన ప్రారంభం : November 20
108 రోజుల సాధన మరియు 48 దినముల నోము ముగింపు తేదీ: జనవరి 6- సద్గురు అగస్త్య మహర్షుల వారి గురు పూజా దినము న పూర్తి అగును.
108 దినముల ఆత్మగాయత్రి సాధన
సాధన ప్రారంభం : September 21
48 దినముల ఆత్మగాయత్రి నోము
సాధన ప్రారంభం : November 20
108 రోజుల సాధన మరియు 48 దినముల నోము ముగింపు తేదీ: జనవరి 6- సద్గురు అగస్త్య మహర్షుల వారి గురు పూజా దినము న పూర్తి అగును.
• ఆత్మలింగ పూజ పూర్తి చేసిన సద్గురు అగస్త్య మహర్షి శిష్యులందరూ (బ్యాచ్ 1 - 10) 108 రోజుల ఆత్మగాయత్రి సాధన చేయాలని అగస్త్య మహర్షి సూచించారు.
• 11వ బ్యాచ్ లో ఆత్మ లింగ పూజ చేసుకొనే వారు అందరు 96 దినముల ఆత్మలింగ పూజ అనగా 48 దినముల శివ లింగ పూజ మరియు 48 దినముల ఆత్మలింగ పూజ లు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత నవంబర్ 20 తేదీన మొదలయ్యే ఆత్మగాయత్రి నోమును చేసుకోవాలి అని సద్గురు అగస్త్య మహర్షి సూచించారు.
• ఆత్మలింగ పూజ చేయని ప్రియమైన భక్తులు అందరు నవంబర్ 20 వ తేదీన ఆరంభం అయ్యే 48 రోజుల ఆత్మ గాయత్రీ నోమును చేసుకోవచ్చును అని సద్గురు అగస్త్య మహర్షి తెలిపియున్నారు.
The first people to sign up will receive the Sri Yantra beforehand.
The first people to sign up will receive the Sri Yantra beforehand.
1. పసుపు తో ఆది మూల గణపతి ని చేసి, ఆయనను ఒక ఆసనం పై నిలిపి, మీ అరచేతి లో కొంచెం నీటి ని తీసుకొని, "ఓం గం గణపతయే నమః " అని మూడు సార్లు పలికి పూజలో, సాధనలో ఎటువంటి విఘ్నములు రాకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఆ నీటిని నేలపై విడిచిపెట్టాలి. అటు తర్వాత "గణపతి కాపు " మంత్రాన్ని మూడు సార్లు పఠించాలి.
2. ఏదైనా ఒక తాంబూల తట్ట లో కానీ లేదా ఒక ఆసనం పై ఒక చతురస్రాకారపు చెక్క పలక ను ఉంచి, దానిపై శ్రీ చక్రపు రేకును ఉంచాలి. శ్రీ చక్రాన్ని నీరు, పలు, ఫల రసములతో , సుగంధ ద్రవ్యములతో అభిషేకించాలి. తరువాత, ఒక శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని తీసుకొని దానితో శ్రీ చక్రాన్ని, చెక్క ముక్కను తుడుచుకోవాలి.
3. ఒక చెక్క టేబుల్ కానీ పీట కానీ ఉంచి దానిపై అభిషేకం చేసి ఉన్న చతురస్రాకారపు చెక్క ముక్కను ఉంచి , దానిపై శ్రీ చక్రాన్ని అమర్చండి.
4. కొంచెం పసుపు కుంకుమ లను తీసుకొని శ్రీ చక్రం మధ్యలో ఉంచి, నమస్కరించుకొనండి. పిమ్మట, మీరు పూజించుకొని ఉన్న మీ ఆత్మలింగమును శ్రీ చక్రము మధ్యలో ఉంచి, దానిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించండి.
5. శ్రీ చక్రం యొక్క నాలుగు మూలలా పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరించుకొనాలి. తొమ్మిది అక్షింతలను తీసుకొని నాలుగు మూలలా వేసి, శ్రీ చక్ర ప్రతిష్టను పూర్తి చేయండి.
ఒకసారి శ్రీ చక్రాన్ని ప్రతిష్ట చేసి, దాని మధ్యలో మీ ఆత్మలింగాన్ని ప్రతిష్ట చేసాక, మరల శ్రీ చక్రాన్ని శుభ్రం చేసి, క్రొత్తగా పసుపు కుంకుమలను , పువ్వులను, అక్షింతలను వుంచటమో, మధ్యలో ఉన్న ఆత్మలింగాన్ని తీసి శుభ్ర పరచడమో చేయరాదు. పైన తెలిపిన పద్ధతిని ఒకే ఒకసారి మాత్రమే చేయాలి.
1. స్నానాదికాలు కావించి, సూర్యోదయ సమయములో అరచేతులలోనికి నీటిని తీసుకొని " ఓం గం గణపతయే నమః " అని మూడు సార్లు పలికి ఆ నీటిని నేలపై విడవాలి. తరువాత "గణపతి కాపు" మంత్రాన్ని మూడు సార్లు పలకాలి. మూడు సార్లు ప్రాణాయమాన్ని చేసి, తరువాత 11 సార్లు గుంజీలు తీయాలి. చేయగలిగిన వారు 108 సార్లు గుంజీలు తీయవచ్చును.
2. శ్రీ చక్రానికి క్రింద వైపు ఉన్న పీట లేదా పలక పై శ్రీ చక్రానికి నాలుగు వైపులా నాలుగు దీపాలను వెలిగించి అమర్చాలి. దీపాల యొక్క అగ్ని శ్రీచక్రానికి అంటకుండా ,ఆ వేడిమి మాత్రమే తగిలేలా చూసుకోవాలి. (దీపాల మంటను చిన్నదిగా ఉండేలా అమర్చుకోవాలి)
3. నాలుగు దీపాలను వెలిగించి వానికి పుష్పములు సమర్పించాలి. ( శ్రీ చక్రము పై పుష్పములు వేయరాదు )
4. 108 రోజుల సాధన చేయాలి అనుకున్న వారు, అరచేతులలోకి కొంచెం నీటిని తీసుకొని, "కరుణ" అనే వాకిలి తెరుచుకోవాలి " అని ప్రార్థించి, నేలపై విడిచిపెట్టాలి. మిగిలిన వారు "లోకంలో అన్ని ఆత్మలు విడుదల పొందాలి" అని ప్రార్థించి నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టాలి.
5. తరువాత ౧౨ సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని లోతుగా భక్తిగా ఉచ్చరించాలి.
6. మరల కొంచెం నీటిని చేతిలోకి తీసుకొని, "ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః " అని గురువును స్తుతిస్తూ నమస్కరించుకుని, ఆ నీటిని నేలపై విడిచిపెట్టాలి.
7. తర్వాత ఆది దీపము యొక్క గాయత్రి మంత్రాన్ని 108 మార్లు అనగా ఒక ఘడియ కాలం (24 నిముషముల పాటు) ఉచ్చరించాలి.
8. "ఓం ఆదిశక్తియే నమః " అని మూడు సార్లు పలుకుతూ కొంచెం నీటిని తీసుకొని నేలపై సమర్పణ చేయాలి.
9. కొంచెం నీటిని చేతిలోకి తీసుకొని, "ఓం ఆదిలక్ష్మియే నమః " అని మూడు సార్లు పలికి నేలపై సమర్పించాలి.
10. కొంచెం నీటిని చేతిలోకి తీసుకొని, "ఓం ఆది మహాసరస్వతియే నమః " అని మూడు సార్లు పలికి నేలపై సమర్పించాలి.
11. ఇపుడు కొంచెం సేపు కన్నులు మూసుకొని ధ్యానావస్థలో కూర్చొని, ఈ విశ్వంలోని మహా శక్తులు, ముగురమ్మల సంపూర్ణ శక్తులు, పాదరసము, వెండి, స్వర్ణము మరియు తామ్రము (రాగి) మొదలైన నాలుగు విధముల కాంతి పోగులు (లైట్ ఫైబర్స్) అతీతముగా ఆకర్షించబడి శ్రీ చక్రములోను, మీ ఆత్మలోను , ప్రాణము లోను ప్రతిష్టించబడుటను చూస్తూ ధ్యానించాలి.
12. ఇపుడు ఆత్మగాయత్రి మంత్రాన్ని ౧౨ సార్లు ఉచ్చరించాలి. తరువాత నీటిని తీసుకొని నేలపై విడవాలి.
13. ఆత్మలింగ రూపాన్ని లోతుగా ప్రార్థించి, 108 శివాంశల అష్టోత్తరాన్ని పఠించాలి. ఒక్కొక్క శివాంశ యొక్క పేరును ఉచ్ఛరించే సమయంలో ఆ శక్తులు మీ శిరసులోపల విద్యుదయస్కాంత తరంగాలుగా ప్రవహించి, పెరిగి పలు కర్మ ముద్రలను తీసివేస్తూ ఉన్నట్లుగాను, రక్తము పలుచనై పైకి ప్రసరిస్తూ ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానించాలి. (ఆత్మ లింగ పూజ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.)
14. మరల కొంచెం నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టి, పూజను పరిసమాప్తి చేయాలి.
15. ఆఖరున, కొంత సేపు కన్నులను మూసుకొని ధ్యాన స్థితిలో ఉంది, మీ శిరసులో జరిగే మార్పులను తెలుసుకొంటూ అనుభూతి చెందాలి.
16. ప్రతిరోజూ అనేక మందికి ఆత్మగాయత్రి మంత్రాన్ని తెలిపి, వారిచే రోజుకు ౧౧ సార్లు ఆ మంత్రాన్ని జపించేలా చేయాలి.
17. అనుదినము రాత్రి నిద్రించుటకు పూర్వము, శ్రీ కృష్ణుని ద్వారా అనుగ్రహించబడిన "శరణాగత ధ్యానం" చేసుకోవాలి.
18. ఈ సాధనా కాలమంతయు సాత్వీక ఆహారాన్ని శ్రీ చక్రానికి సమర్పించి, అటు తర్వాతనే మీ ఆహారాన్ని తీసుకోవాలి. (మీరు సాధారణంగా తినే ఆహారంలో సగభాగం మాత్రమే తీసుకోవాలని సద్గురు అగస్త్యుల వారు సూచించారు)
The first people to sign up will receive the Sri Yantra beforehand.
1. సాధన సమయంలో నేను మాంసం తినవచ్చా?
మాంసాహారం తినకుండా ఉంటే అధిక ఫలితం లభిస్తుంది.
2. ఈ పూజ చేసుకొనే కాలంలో దాంపత్య సంబంధము ఉండవచ్చునా?
ఈ వ్రతము చేయాలి అన్న సంకల్పమే, అత్యధిక జ్ఞానాన్ని మీకు ఇవ్వగలదు.
3. సాధన సూర్యోదయం సమయంలో చేయలేక పోయినచో, వేరే సమయంలో చేయవచ్చునా?
సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకొన్నచో, అధిక ఫలితం లభించగలదు. అలా చేయలేని వారు వేరే ఏ సమయంలో అయినా చేసుకోవచ్చును.
4. ఋతుకాల సమయంలో సాధనను చేయవచ్చునా?
దీపము వెలిగించుట, శ్రీ యంత్రాన్ని , లింగాన్ని తాకుట వంటివి చేయకుండా, మంత్రాన్ని మాత్రము ఉచ్ఛరించవచ్చును అని సద్గురు అగస్త్యులవారు తెలిపియున్నారు.
5. ఇంట్లో ఉన్నవారు మాంసాహారం తినవచ్చునా?
దీనికి ఎలాటి అభ్యంతరమూ లేదు.
6. ఒకవేళ ఏదైనా కారణము వలన కొన్ని దినముల ప్రయాణము ఏర్పడినచో, తిరిగి సాధనను కొనసాగించవచ్చునా?
నిరభ్యంతరంగా కొనసాగించవచ్చును.
7. 108 రోజుల ఈ ఆత్మగాయత్రి సాధనను ఏ విధముగా పరి సమాప్తి చేయాలి?
దీనిని గురించి సద్గురు అగస్త్యుల వారు అతి త్వరలోనే వివరించగలరు.
8. సాధన సమయంలో నేను మద్యం తాగవచ్చా?
తాగకుండా ఉంటే, అధిక ఫలితం లభించును.
9. వేరే ఊరికి ప్రయాణించి వెళ్ళేటపుడు శ్రీ యంత్రాన్ని నాతోపాటు తీసుకుని వెళ్ళవచ్చునా?
యంత్రాన్ని ఇంటిలోనే ఉంచి, మీరు ప్రయాణించి వెళ్లవచ్చును; ఆ కాలంలో ప్రతిరోజూ కన్నులు మూసుకొని ధ్యానావస్థ లో ఉండి, మానసికంగా ఆ పూజను చేసుకొనవచ్చును. ( మీ యంత్రాలకు ఇంటిలోని వారు, వేరెవరూ దీపాలను వెలిగించరాదు)
10. ఇంతవరకు ఆత్మలింగ పూజ చేయని వారు ఈ సాధనను చేయవచ్చునా?
శ్రీయంత్రం మధ్యలో ఆత్మలింగాన్ని బదులుగా పసుపు గణపతి ని ఉంచి 48 దినముల పూజ ను చేసుకొనవచ్చును అని సద్గురు అగస్త్యుల వారు తెలిపియున్నారు.
11. 48 దినముల ఆత్మగాయత్రి నోమును ఎపుడు ప్రారంభిస్తున్నారు?
నవంబర్ 20 వ తేదీ న 48 రోజుల ఆత్మగాయత్రి నోము ప్రారంభం అగును.
12. ఆత్మలింగ పూజను చేయని వారు, శ్రీ చక్రం మధ్యలో ప్రతి రోజూ క్రొత్తగా పసుపు గణపతిని చేసి ఉంచి పూజించవలెనా?
లేదు. మొదటి రోజు చేసి పూజించిన పసుపు గణపతిని అలాగే ఉంచి, ప్రతి రోజూ పూజకు ముందు దానిపై కొంచెం నీటి చుక్కలు వేసి, దానిపై ఏర్పడే పగుళ్ళను మృదువుగా సరిచేసి, పూజించుకోవాలి.
13. నేను ప్రస్తుతం 11వ గ్రూపులో ఆత్మ లింగ పూజ చేస్తున్నాను. నేను 48 రోజుల ఆత్మ గాయత్రి సాధన చేయవచ్చా?
96 రోజుల ఆత్మ లింగ పూజ (48 + 48 రోజుల పూజ) పూర్తయిన తర్వాత, మీరు నవంబర్ 20 నుండి ఆత్మ గాయత్రి నోమును ప్రారంభించవచ్చు.
14. సాధన/నోము ఆఖరున పసుపు గణపతిని ఏమి చేయాలి?
పసుపు గణపతిని నీటిలో కలిపివేసి, ఆ నీటిని ఎవరు తొక్కని చోట మట్టిలో పోయండి.
15. సాధన పూర్తి అయ్యాక శ్రీ చక్రాన్ని ఏమి చేయాలి?
మీ పూజగది లో ఒక చోట ఉంచి, రోజువారీగా మీరు ప్రార్థన చేసే విధముగా చేసుకొంటే చాలు.
16. ఇంట్లోని వారు విడి విడిగా వారికి ప్రత్యేకించి ఒక్కొక్క శ్రీ యంత్రాన్ని ఉంచి పూజించవలెనా?
అవును. ప్రతి ఒకరు వారికోసం ప్రత్యేకించి ఒక శ్రీ యంత్రాన్ని ఉంచి, దాని మధ్యలో వారి ఆత్మలింగాన్ని ఉంచి పూజించుకోవాలి. ఆత్మలింగ పూజ చేయని వారు, వారి వారి ప్రత్యేకమైన శ్రీ యంత్రం మధ్యలో పసుపు గణపతిని ఉంచి పూజించుకోవాలి.
17. ఇంటిలోని వారు , బంధువులు ఎవరైనా మరణిస్తే, సాధనను కొనసాగించవచ్చునా?
ఇంటిలోని వారు ఎవరైనా మరణిస్తే 11 రోజుల పాటు, వెలుపల ఎవరైనా బంధువులు మరణిస్తే మూడు రోజుల పాటు దీపాలు వెలిగించకుండా సాధన చేసుకోవచ్చును.
18. సాధన పూర్తయిన తర్వాత యంత్రంలో ఉంచిన అక్షతలను ఏమి చేయాలి?
పసుపు అక్షంతలు బంగారు రంగుకో లేదా తెల్లటి రంగుకో మారి ఉంటాయి. వాటిని తీసుకొని, ఏదైనా ఒక మొక్క లేదా చెట్టు మొదట్లో నీటి తో పాటుగా సమర్పించండి.
19. దీపాలను ప్రతి రోజు శుభ్రపరుచుకొనవచ్చునా?
శుభ్రపరచుకొనవచ్చును.
20. శ్రీ చక్రం చుట్టూ ప్రతిరోజూ పువ్వులు అర్పించాలా?
అవసరం లేదు. మీరు పువ్వులు అర్పించకుండానే పూజ చేయవచ్చు. పువ్వులు అర్పించాలనుకునే వారు పువ్వులు శ్రీ చక్రాన్ని తాకకుండా చూసుకోవాలి.
21. దీపాల జ్వాల లేదా జ్యోతి ఎలా ఉండాలి?
దీపాల జ్వాల చిన్నది గా ఉండేలా చూసుకొనండి.
22. మా అంతట మేమే శ్రీ యంత్రాన్ని తెచ్చుకోవచ్చునా ?
తెచ్చుకొనవచ్చును. అయితే, దానిని ఒక శ్రీ చక్ర పూజ జరిగే ఆలయములో ఉంచి కుంకుమ పూజ చేయించి తర్వాత మీ సాధనకై ఉపయోగించుకొనవలెను.
23. నేను ఇంట్లో ఇదివరకే ఉంచి పూజించే శ్రీ యంత్రాన్ని ఉపయోగించుకొనవచ్చునా?
మీరు ఇప్పటివరకు పూజించిన యంత్రం యొక్క ఉద్దేశ్యం వేరు. ఈ సాధన ఉద్దేశ్యం వేరు. మీ ప్రాణము సంక్షేపించి, "కరుణ" వాకిలి తప్పక తెరవాలి అను ఉద్దేశ్యం నెరవేరాలి అంటే, ఒక కొత్త యంత్రాన్ని తెచ్చి ఉపయోగించాలి.
24. అన్బాలయం లో ఇచ్చే యంత్రాన్ని మాత్రమే కొని తెచ్చి ఉపయోగించుకొనవలెనా?
అలా ఏమీ లేదు. అగస్త్యుల వారు తెలిపిన విధముగా , 160 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న 16 సెం.మీ x 16 సెం.మీ కొలతలతో శ్రీ యంత్రాన్ని తయారు చేసి, శ్రీ కాంచి కామాక్షి ఆలయంలో ఉంచి, పూజలు చేసిన తర్వాత మాత్రమే అందరికీ పంపుతారు. అలా కాక, తమంతట తామే కొనుక్కోవాలి అనుకునే వారు, పైన చెప్పిన కొలతలు, బరువు ప్రమాణాల ప్రకారము తయారు చేయించి, శ్రీచక్రార్చన జరిగే ఏదైనా ఒక ఆలయంలో ఉంచి కుంకుమ పూజ జరిపించి, అటుపై ఆ ఆయంత్రాన్ని ఉపయోగించుకొనవలెను.
25. నాకు అగస్త్యుల వారు ఇచ్చిన కొలతల ప్రకారం శ్రీ చక్రం లభించలేదు. అపుడు నేను ఏమి చేయాలి?
అన్బాలయం నుండి పొందవచ్చును. లేదా వీలుకానప్పుడు మీకు లభించిన శ్రీ యంత్రాన్ని తెచ్చి, మనస్ఫూర్తిగా శుద్ధ భావనతో పూజించుకొనవచ్చును.
26. ఆసనంగా ఉపయోగించే చతురస్రాకారపు చెక్క పలకకు ఏవైనా కొలతలు ఉన్నవా?
శ్రీ చక్రం పొడవు వెడల్పులకు సరిపోయే విధముగా ఉండాలి. అలా లభ్యం కానప్పుడు శ్రీ చక్రం కొలతల కంటే చిన్నదిగా ఉండాలి.
27. పూజగది శుభ్రం చేసే సమయంలో శ్రీ చక్రాన్ని కదిలించ వచ్చునా?
సాధనా కాలం ముగిసే వరకు, శ్రీ యంత్రాన్ని కదిలించ కూడదు.
28. ఈ పూజ గురించి నాకు ఇప్పుడే తెలిసింది, నేను దీన్ని చేయవచ్చా?
చేయవచ్చును. జనవరి 6వ తేదీ కి ముందు ఎపుడైనా మొదలుపెట్టి, జనవరి 6వ తేదీన సద్గురు అగస్త్యుల వారి గురుపూజ రోజున సమాప్తి చేసుకొనవచ్చును.
29. చిన్న పిల్లలు ఈ పూజ చేయవచ్చునా?
48 దినముల పూజ అనగా ఒక మండల కాలం పూజ చేసుకొనవచ్చును. శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి, దాని మధ్యన పసుపు గణపతిని ఉంచి, ఆత్మగాయత్రి మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించి, ఆది దీపం గాయత్రి మంత్రాన్ని 12 సార్లు ఉచ్చరించిన చాలును.
30. సాత్విక ఆహారం అనగా ఏమి?
వండిన ఆహారం చల్లారకముందే తినాలి మరియు భూమిలో పండించిన కూరగాయలను అనగా దుంప కూరలను వాడకూడదు. పాత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలను ఉడికించకుండా తినవచ్చు. మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల హానికరమైన ఉష్ణ వ్యర్థాలు తొలగిపోతాయి. తెల్లవారుజామున తేనె కలిపిన గోరువెచ్చని నీటిని శ్రీ చక్రానికి నైవేద్యం పెట్టి, దానిని సేవించుట ద్వారా శారీరక రుగ్మతలు తొలగిపోగలవు. అయితే, ఆహార స్వచ్ఛత కంటే హృదయ స్వచ్ఛత గొప్పదని దయచేసి గుర్తుంచుకోండి.
31. రాత్రిపూట శరణాగతి ధ్యానం చేయడం అవసరమా?
రాత్రి పడుకునే ముందు శరణాగతి ధ్యానం చేయడం, తెల్లవారుజామున శ్రీ చక్రాన్ని పూజించడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభించగలవు.
32. ప్రతిరోజూ పసుపు గణపతిని ఉంచి పూజించి, ఆ తర్వాత సాధన చేయాలా?
అక్కరలేదు. మొదటి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి, నమస్కరించుకొంటే చాలును. ఇక ప్రతి రోజూ నీటిని తీసుకొని నేలపై విడిచి నమస్కరించుకొంటే సరిపోతుంది.
33. దీపాలకు ఏ విధమైన నూనెను ఉపయోగించాలి?
మీ మనసుకు నచ్చిన ఏ నూనెను అయినా ఉపయోగించుకొనవచ్చును.
34. నా వద్ద చెక్క ఆసనం పెట్టటానికి పెద్ద పలక/పీట లేదు. ఏమి చేయాలి?
పెద్ద పలక లేదా పీట, టేబుల్ లేని వారు చెక్క ఆసనాన్ని నేరుగా నేలపై పెట్టి, దానిపై శ్రీ యంత్రాన్ని ఉంచి కూడా పూజించుకొనవచ్చును.
The first people to sign up will receive the Sri Yantra beforehand.
"ఇఱై పయన మామ్ అగప్పయనం
తుల్లియమాయ్ నిగళ్ న్దేరిడ
తుంబిక్కై ఎనుమ్ నమ్బిక్కై కొండు
ఒళిప్పాలం అమైన్దరుళ్వాయ్
సిందామల్ సిదరామల్ మనమదువుమ్ ధ్యానిక్క
కరుణై ఎనుమ్ కాప్పిడువాయ్
ఆదిమూల గణపతియే
మన్ రాడి తొళుగిన్రేన్
మరకత వడివాయ్ ఎళుందరుళ్ వాయ్ "
1. ఓం శ్రీ రుద్రనే పోట్రి
2. ఓం శ్రీ వీరభద్రనే పోట్రి
3. ఓం శ్రీ మహేశనే పోట్రి
4. ఓం శ్రీ సదాశివనే పోట్రి
5. ఓం శ్రీ శరభేశ్వరనే పోట్రి
6. ఓం శ్రీ చంద్రశేఖరనే పోట్రి
7. ఓం శ్రీ గంగాధరనే పోట్రి
8. ఓం శ్రీ పశుపతయే పోట్రి
9. ఓం శ్రీ నీలకంఠనే పోట్రి
10. ఓం శ్రీ మాతృభూతేశ్వరనే పోట్రి
11. ఓం శ్రీ మహామాయనే పోట్రి
12. ఓం శ్రీ సోమ స్కంధనే పోట్రి
13. ఓం శ్రీ శైలేశ్వరనే పోట్రి
14. ఓం శ్రీ మార్గబంధువే పోట్రి
15. ఓం శ్రీ మృత్యుంజయనే పోట్రి
16. ఓం శ్రీ యోగేశ్వరనే పోట్రి
17. ఓం శ్రీ మహా కాలనే పోట్రి
18. ఓం శ్రీ త్యాగేశనే పోట్రి
19. ఓం శ్రీ లింగోద్భవనే పోట్రి
20. ఓం శ్రీ శంకరనే పోట్రి
21. ఓం శ్రీ జ్ఞానేశ్వరనే పోట్రి
22. ఓం శ్రీ పరమేశ్వరనే పోట్రి
23. ఓం శ్రీ కపాలేశ్వరనే పోట్రి
24. ఓం శ్రీ ప్రాణనాధనే పోట్రి
25. ఓం శ్రీ ఆత్మ నాభనే పోట్రి
26. ఓం శ్రీ నాగేశ్వరనే పోట్రి
27. ఓం శ్రీ అరుణాచలేశ్వరనే పోట్రి
28. ఓం శ్రీ సహస్ర లింగేశ్వరనే పోట్రి
29. ఓం శ్రీ కామేశ్వరనే పోట్రి
30. ఓం శ్రీ నిర్మలేశ్వరనే పోట్రి
31. ఓం శ్రీ చండికేశ్వరనే పోట్రి
32. ఓం శ్రీ విశ్వేశ్వరనే పోట్రి
33. ఓం శ్రీ పంచాక్షరనే పోట్రి
34. ఓం శ్రీ తాండవ మూర్తియే పోట్రి
35. ఓం శ్రీ పరకాయనే పోట్రి
36. ఓం శ్రీ అగ్నీశ్వరనే పోట్రి
37. ఓం శ్రీ జ్యోతి స్వరూపనే పోట్రి
38. ఓం శ్రీ కాలభైరవరే పోట్రి
39. ఓం శ్రీ అగస్తీశ్వరనే పోట్రి
40. ఓం శ్రీ అర్థ నారీశ్వరనే పోట్రి
41. ఓం శ్రీ లోకేశ్వరనే పోట్రి
42. ఓం శ్రీ డమ రూపనే పోట్రి
43. ఓం శ్రీ సూర్య లింగేశ్వరనే పోట్రి
44. ఓం శ్రీ వాయు లింగేశ్వరనే పోట్రి
45. ఓం శ్రీ గోరఖేశ్వరనే పోట్రి
46. ఓం శ్రీ జలకంఠేశ్వరనే పోట్రి
47. ఓం శ్రీ శూన్య లింగేశ్వరనే పోట్రి
48. ఓం శ్రీ బ్రహ్మేశ్వరనే పోట్రి
49. ఓం శ్రీ సర్వేశ్వరనే పోట్రి
50. ఓం శ్రీ సుడలైయాండి ఈశ్వరనే పోట్రి
51. ఓం శ్రీ కైలాస నాధనే పోట్రి
52. ఓం శ్రీ శివలోక నాథనే పోట్రి
53. ఓం శ్రీ దక్షిణామూర్తియే పోట్రి
54. ఓం శ్రీ నటరాజ మూర్తియే పోట్రి
55. ఓం శ్రీ వజ్రేశ్వరనే పోట్రి
56. ఓం శ్రీ భీమేశ్వరనే పోట్రి
57. ఓం శ్రీ దిగంబరేశ్వరనే పోట్రి
58. ఓం శ్రీ దివ్యరూపనే పోట్రి
59. ఓం శ్రీ మల్లికేశ్వరనే పోట్రి
60. ఓం శ్రీ మరుదేశ్వరనే పోట్రి
61. ఓం శ్రీ అష్టలింగేశ్వరనే పోట్రి
62. ఓం శ్రీ షోడశ లింగేశ్వరనే పోట్రి
63. ఓం శ్రీ కనక సభేశ్వరనే పోట్రి
64. ఓం శ్రీ తామ్ర సభేశ్వరనే పోట్రి
65. ఓం శ్రీ ఆదిశివనే పోట్రి
66. ఓం శ్రీ ఆదిశక్తియే పోట్రి
67. ఓం శ్రీ మత్స్యేంద్రనే పోట్రి
68. ఓం శ్రీ గణనాథనే పోట్రి
69. ఓం శ్రీ ఏకనే పోట్రి
70. ఓం శ్రీ విశ్వకర్మనే పోట్రి
71. ఓం శ్రీ బుధదేవనే పోట్రి
72. ఓం శ్రీ బృహస్పతయే పోట్రి
73. ఓం శ్రీ శుక్రాచార్యనే పోట్రి
74. ఓం శ్రీ ఇంద్రదేవనే పోట్రి
75. ఓం శ్రీ కుబేరనే పోట్రి
76. ఓం శ్రీ మందహాసినియే పోట్రి
77. ఓం శ్రీ తపోదనరే పోట్రి
78. ఓం శ్రీ శిల్పణ్ణరే పోట్రి
79. ఓం శ్రీ రసనాకరనే పోట్రి
80. ఓం శ్రీ పంచానందరే పోట్రి
81. ఓం శ్రీ కరుప్పణ్ణస్వామియే పోట్రి
82. ఓం శ్రీ మహాకాళియే పోట్రి
83. ఓం శ్రీ భూమాదేవియే పోట్రి
84. ఓం శ్రీ వెట్రివీరనే పోట్రి
85. ఓం శ్రీ పరాశర మహర్షియే పోట్రి
86. ఓం శ్రీ వ్యాస మహర్షియే పోట్రి
87. ఓం శ్రీ మార్కండేయ మహర్షియే పోట్రి
88. ఓం శ్రీ నారద మహర్షియే పోట్రి
89. ఓం శ్రీ ప్రహ్లాద మహర్షియే పోట్రి
90. ఓం శ్రీ పులస్త్య మహర్షియే పోట్రి
91. ఓం శ్రీ చిత్రగుప్త మహర్షియే పోట్రి
92. ఓం శ్రీ ఆదిలక్ష్మియే పోట్రి
93. ఓం శ్రీ ధనలక్ష్మియే పోట్రి
94. ఓం శ్రీ ధైర్యలక్ష్మియే పోట్రి
95. ఓం శ్రీ గజలక్ష్మియే పోట్రి
96. ఓం శ్రీ సంతాన లక్ష్మియే పోట్రి
97. ఓం శ్రీ ధాన్య లక్ష్మియే పోట్రి
98. శ్రీ విజయ లక్ష్మియే పోట్రి
99. ఓం శ్రీ విద్యా లక్ష్మియే పోట్రి
100. ఓం శ్రీ దుర్గా దేవియే పోట్రి
101. ఓం శ్రీ అన్నపూరణియే పోట్రి
102. ఓం శ్రీ కమలాయతాక్షియే పోట్రి
103. ఓం శ్రీ నీలాయతాక్షియే పోట్రి
104. ఓం శ్రీ కామాక్షియే పోట్రి
105. ఓం శ్రీ మధురై మీనాక్షియే పోట్రి
106. ఓం శ్రీ విశాలాక్షియే పోట్రి
107. ఓం శ్రీ అంబుజాక్షియే పోట్రి
108. ఓం శ్రీ చండి మహాదేవియే పోట్రి
The first people to sign up will receive the Sri Yantra beforehand.
Helpdesk
SAS. Sangeetha
+91 98409 68377
SAS. Shylu Vijaya Kumar
+91 97887 31427
SAS. Uma Muneeswaran
+91 97379 00559