ఆత్మ గాయత్రి నోము
ఆత్మ గాయత్రి నోము చేసే పద్ధతి
నోము చేసుకొనే వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, మరియు స్నేహితులు కలిసి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక విఘ్నేశ్వరుని ఆలయమునకు వెళ్ళండి. అచట వినాయకుని దర్శించి, “మేము సంకల్పించిన ఆత్మ గాయత్రి నోము సంపూర్ణమైన ఫలితములను ఇవ్వాలి” అని ప్రార్థన చేసుకొనండి.
పిదప చేతిలో నీటి ని తీసుకొని “ఓం శ్రీ ఆది మూల గణపతయే నమః” అని మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎవరూ నడవని చోట నేలపై నీటి ని సమర్పించండి. ఈ విధముగా 3 మార్లు చేయండి.
“ఓం శ్రీ కాలభైరవాయ నమః “ అని ముమ్మారు ఉచ్చరిస్తూ శ్రీ కాలభైరవుని రక్ష దారమును మీ కుడిచేతికి కట్టుకొనండి.
ఆలయం లో ఏదైనా ఒక ప్రశాంతంగా ఉండే చోటు చూసుకొని, ఆ స్థలాన్ని నీటితో శుభ్రపరచండి.
ఆ తర్వాత ఆ స్థలంలో చెక్కపలకను ఒకదానిని ఆసనంగా ఏర్పరిచి, దానిపై బియ్యపు పిండి తో మూడు బిందువులను/చుక్కలను త్రికోణాకారం వచ్చేలాగున వేసుకోవాలి. (Therefore symbol ∴వలె). ఇపుడు క్రింద నున్న రెండు బిందువులతో ఎడమ వైపు బిందువు వద్ద శ్రీ ఆదిశక్తిని నిలిపి "ఓం శ్రీ ఆదిశక్తియే నమః " అని మూడు మార్లు ఉచ్చరిస్తూ బియ్యపు పిండి తో ఒక బిందువును ఏర్పరచాలి , కుడివైపు ఉన్న బిందువు వద్ద శ్రీ ఆదిశివుని నిలిపి "ఓం శ్రీ ఆదిశివాయ నమః " అని, ముమ్మారు ఉచ్చరిస్తూ బియ్యపు పిండితో మరొక బిందువును ఉంచాలి. ఈ రెండు బిందువులను ఒక సరళ రేఖ తో కలపాలి. ఈ రెండు శక్తులను ఒకటిగా కలిపే "తత్వమసి" శక్తులైన సద్గురు శ్రీ అగస్త్యుల వారిని పైన ఉన్న బిందువద్ద నిలిపి అచట " ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః " అని ముమ్మారు ఉచ్చరిస్తూ బియ్యపు పిండితో బిందువును ఏర్పరచాలి. ఇపుడు ఈ మూడు బిందువులను పిండి తో రేఖలను గీస్తూ కలిపి త్రికోణాకారం ఏర్పరచాలి. తర్వాత మూడు బిందువులు ఉన్నచోట మూడు మట్టి ప్రమిదెలను ఉంచాలి. అందులో వత్తి వేసి వెలిగించినపుడు వాని జ్యోతి శిఖలు త్రికోణం యొక్క లోపలి భాగం వైపు వచ్చేలా అమర్చి ఉంచి, దీపాలను వెలిగించుకోవాలి. ఇపుడు త్రికోణపు మధ్య భాగంలో అక్షతలు కానీ, పువ్వులు గాని పరచి సమర్పణ చేసుకోవాలి.
భోజన పదార్థాలు కానీ, ఫలములు కానీ మూడు దీపాలలో కొలువై ఉన్న దైవ శక్తులకు నైవేద్య సమర్పణం చేసుకోవాలి. ఆ త్రికోణానికి సమీపంలోనే ఒక చిన్న మట్టి కుండలో నీటిని నింపి ఉంచుకోవాలి. (ప్రతి రోజూ అన్నప్రసాదం నివేదించి దానిని భుజించాలి. అలా వీలుకానివారు ఉదయం వేళలో అన్నము, సాయం వేళలో పండ్లు 48 రోజులపాటు నివేదించి వానిని భుజించాలి. అలా చేసినవారికి గొప్ప ఫలితములు లభించును. భ్రింగరాజ్ లేదా గుంటగలగరాకు అనే మూలికా ఆకులను తెప్పించుకొని వండుకొని తిన్నచో శరీరంలో ఉన్న అన్ని కలుషితములు మాయమైపోగలవు.)
తరువాత, చేతి లో నీటిని ఉంచుకొని, "నా ప్రాణము యొక్క అవసరాలు నెరవేరాలి, ప్రాణం మరియు ఆత్మ ఏకమై శివశక్తి రూపాన్ని ధరించి, తత్త్వమసి గా ఉండాలి " అని ప్రార్థన చేస్తూ ఆ నీటిని త్రికోణం మధ్యలో ఉన్న పువ్వులపై గానీ అక్షతలపై గానీ సమర్పణ చేయండి. ఇలా మూడు మార్లు ప్రార్థిస్తూ నీటిని వదలాలి. మరల మీ చేతిలో నీరుంచుకొని " లోకంలోని అన్ని జీవరాశులు ముక్తిని పొందాలి" అని ప్రార్థిస్తూ నీటిని త్రికోణంలో సమర్పించాలి. ఇది కూడా మూడు సార్లు చేయాలి.
దీపాలను చూస్తూ కూర్చొని, 'అగస్త్య, ఆదిశివ, ఆదిశక్తి మరియు శ్రీ కాలభైరవులయొక్క అష్టోత్తరములను శ్రద్ధగా ఓర్పుతో పఠించాలి.
అప్పుడు, మీ కళ్ళు మూసుకుని, మీ తలపై దృష్టిని కేంద్రీకరించి, ఆత్మ గాయత్రి మంత్రాన్ని అనేకమార్లు జపించండి. (లేనిపక్షాన కనీసం 27 మార్లు అయినా జపించాలి). ఆఖరున మూడు దీపాలకు భక్తి తో శరణాగతి తో ధూప-దీపములు, నైవేద్యములను సమర్పించి ఆరాధించండి. ఇపుడు మీకు ఇచ్చిన విభూతిని మీ నుదుటిపై భక్తి తో ధరించండి.
మీరు దేవునికి సమర్పించిన అన్న ప్రసాదాలను, ఫలములను, కుండలో ఉంచిన నీటిని మీకు తోడుగా నిలిచి శక్తినిచ్చిన మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వితరణ చేసి, మీరు కూడా భుజించండి.
మీరు వెళ్లిన ఆలయానికి వచ్చిన ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తికి ఆత్మ గాయత్రీ మంత్రం ముద్రించిన కార్డును ఇవ్వండి మరియు కనీసం ఒక్కసారైనా మంత్రాన్ని పఠించడానికి సహాయం చేయండి. మీవలన ఎన్ని కార్డులు ఇవ్వగల వీలగునో అన్నిటిని అక్కడికి వచ్చిన భక్తులకు పంచండి. ప్రతిరోజూ ఆత్మ గాయత్రి మంత్రాన్ని పఠించడంలో కనీసం ఒకరికి అయినా సహాయం చేయాలి. (ఆత్మ గాయత్రి) మంత్రాన్ని జపించే మానవులు చాలా సులభంగా అగస్త్య మహర్షి యొక్క లైట్ బ్రిడ్జి తో అనుసంధానించబడి మోక్షాన్ని పొందవచ్చని సద్గురు తెలిపియున్నారు. కావున ఆత్మ గాయత్రి నోము ఆచరించే ఆత్మీయులు ప్రతిరోజు తమ ఊరిలో నివసించే ఒక అపరిచిత వ్యక్తి కైనా, ఒక సారి అయినా ఆత్మ గాయత్రి మంత్రాన్ని పఠించడంలో సహాయం చేయాలి. ఈ విధంగా, మంత్రాన్ని జపించిన తరువాత, వ్యక్తి యొక్క ఆత్మ సద్గురు అగస్త్య మహర్షి యొక్క కాంతి వంతెన (లైట్ బ్రిడ్జి) కి అనుసంధానించబడుతుంది. ఈ విధంగా నోము పూర్తిచేసుకున్నతర్వాత కిట్ లోని అన్ని వస్తువులను తీసుకొని తమ ఇళ్ళకి వెళ్ళవచ్చును.
ఆత్మ గాయత్రి నోము ఎన్ని రోజులు చేయాలి ?
01.11.2024 తేదీ న ప్రారంభమై, 19.12.2024 తేదీన ముగియును. ఈ రెండు తేదీల నడుమ ఏ తారీఖున అయినా నోమును ప్రారంభించవచ్చును. అయితే, మార్గశిర మాసం, ఆశ్లేష నక్షత్రం తేదీ 19.12.2024 నాడు సద్గురు అగస్త్యుల వారి గురుపూజా మహోత్సవము. ఆరోజే నోము ఆఖరు రోజు. అధిక దినములు నోమును చేసేవారికి ఫలము కూడా అధికమే
ఆత్మ గాయత్రి నోము కిట్ లోని వస్తు సామగ్రి
· కాలభైరవుని రక్షా దారము
· ఆత్మ గాయత్రి మంత్రము అచ్చు వేసిన కార్డు
· సద్గురు అగస్త్య మహర్షి వారి ఆధ్వర్యంలో అన్బాలయం లో వెలసి, మార్గదర్శనం చేసే 12 గురు దేవతల అష్టోత్తర శతనామావళి పుస్తకం
· నట్టాట్రీశ్వరర్ రూపమైన శ్రీ అగస్తీశ్వరుని అభిషేకించిన శక్తివంతమైన విభూతి ప్రసాదము. (నోము కిట్ లోని వస్తువులలో ఉంచిన విభూతిని ఇంట్లో ఉన్న విభూతిలో కలుపుకొని వాడుకొనవచ్చును)
ఆత్మ గాయత్రి నోన్పు కోటి పొందండి కరుణ అంగడిలో ద్వారా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినవారికి త్వరలో పోస్టల్ ద్వారా పంపబడుతుంది.
9789032199 l 9361047636 l 7996774757 l 9944170454
నోమును వారి వారి ఇళ్లల్లో చేసుకొనే విధానము
మీరు మీ కుటుంబ సభ్యులందరు ఒకటిగా చేరి కూర్చొనండి. మీ చేతులలో నీటిని తీసుకొని, " ఓం శ్రీ ఆది మూల గణపతయే నమః " అంటూ ఆ నీటిని నేలపై సమర్పించాలి. ఈ విధంగా మూడు సార్లు చేయాలి.
మీ ఇంటిలో ఉన్న పూజగది లో ఒక స్థలాన్ని ఎంచుకొనండి. ప్రతి రోజూ అదే స్థలం లో నోము చేసుకోవాలి కాబట్టి, రోజూ ఆ ప్రదేశాన్ని నీటి తో శుభ్రం చేసుకొనండి.
తర్వాత, పైన తెలిపిన నిబంధనలలో No.5 నుండి No.10 వరకు అన్నిటిని యథాతథంగా పాటిస్తూ నోమును కొనసాగించండి.
ప్రతి దినము మీ ఇంట్లో నోము పూజ పూర్తి అయిన తర్వాత, ఏదైనా ఒక ఆలయానికి లేదా వెలుపల ఏదైనా ఒక చోటుకి వెళ్లి, అక్కడ ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తికి ఆత్మగాయత్రి మంత్రము ఉన్న కార్డు ఇచ్చి, ఆ మంత్రం పఠించడానికి వారికి సహాయపడాలి. మీ వీలును బట్టి ఎంతమందికైనా ఈ మంత్రం కార్డులను ఇవ్వవచ్చును. అయితే రోజుకి కనీసం ఒక్కరికైనా కార్డును ఇచ్చి, వారిచే మంత్రము ఉచ్చరింపచేయాలి.
ఈ నోమును నోచుకునే రోజులలో మీరు మీ ఎంపిక ప్రకారం ప్రతిరోజూ ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులకు ఆత్మ గాయత్రీ మంత్రాన్ని జపించడంలో సహాయపడవచ్చు. 48 దినముల ఈ నోము నోచుకునే సమయంలో మొత్తం 108, 1008, 10008, 100008 వంటి సంఖ్య లో ఆత్మలను కలుసుకొని వారికి ఆత్మగాయత్రి మంత్రాన్ని ఇచ్చి, వారిచే ఉచ్చరింప చేసి, వారిని మేలుకొనే లాగ చేసినచో అది ఇంకను ఉత్తమమే.
ఉదాహరణకు, 48 రోజుల పాటు ఆత్మ గాయత్రీ వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ప్రతిరోజూ సమీపంలోని ఆలయాన్ని సందర్శించి, ప్రతి రోజు 21 మంది వ్యక్తులకు ఆత్మ గాయత్రీ మంత్రం ముద్రించిన కార్డును అందజేసినచో, ఆ 21 మంది వ్యక్తుల చే ఒక్క సారి అయినా ఆత్మ గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరింపచేసినచో , మొత్తం 48 రోజులకు 1008 మంది ఆత్మలను మేలుకొలిపినట్లు కాగలదు. అపుడు ఆ వ్యక్తి 1008 ఆత్మ కణములు పొంది, దానికి తగిన శక్తులను కూడా పొందగలడు.
తమ ఇంటిలో గురుపూజ యాగం చేసుకొని, నోము దీక్షను విరమించుకొనే విధానము
సద్గురు అగస్త్య మహర్షుల వారి గురుపూజ మహోత్సవ దినమైన డిసెంబర్ ౧౯వ తేదీ, మార్గశిర మాసం, ఆశ్లేష నక్షత్ర మందున, ఉదయము మొదలుకొని, సాయంకాలం వరకు మీ ద్వారా ఎన్ని ఆత్మలను మేలుకొలుపను వీలగునో అంతమందికి సహాయపడి , సద్గురు అగస్త్య మహర్షుల వారి బృహద్ కార్యములో, కొండంత పనికి గోరంత సహాయముగా చేసి, మీ శరణాగతిని తెలియచేసుకొని, తర్వాత సూర్యాస్తమయ ఘడియలలో పసుపు గణపతిని ఆవాహనం చేసి, పూజించుకొనాలి. తర్వాత సద్గురు అగస్త్య మహర్షుల వారి చిత్రపటమునకు పుష్పములతో అలంకరించాలి. సద్గురు అగస్త్యుల వారి చిత్రపటము ఇంటిలో అందుబాటులో లేనివారు ఒక పసుపు ముద్దను వారి రూపముగా భావన చేసి పూజించుకొనవచ్చును.
తర్వాత మీరు ప్రతిరోజూ నోమును చేసుకొనే విధముగానే No.5 మొదలుకొని No.8 వరకు గల అన్ని సూచనలను పాటిస్తూ దాని ప్రకారం చేయాలి.
మీ ప్రయత్నాల ద్వారా, ఆత్మ గాయత్రీ మంత్రాన్ని జపించిన ఆత్మలందరూ సద్గురు అగస్త్య మహర్షి వారి లైట్ బ్రిడ్జ్‌తో కలవాలని ప్రార్థిస్తూ మూడుసార్లు నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టాలి.
ఒక వెడల్పు మట్టి మూకుడు లేదా ఒక వెడల్పాటి పళ్లెమును తీసుకొని అందులో ఇసుకను పోసి, హోమానికి ఉపయోగించే సమిధలు అమర్చి అగ్నిని ప్రజ్వరిల్ల జేయాలి. ఇపుడు మీలో ఒకరు యాగం చేసే స్థలంలో నేయి సమర్పించుటకై కూర్చొనాలి. మిగిలిన వారందరు కలిసి ఆత్మ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలా 24 నిముషముల పాటు జరగాలి.
ఒక వ్యక్తి మాత్రమే అగ్నిని వెలిగించిన చోట ఆసనంపై కూర్చొనాలి. హోమ సమిధలు, పూర్ణాహుతి సామాగ్రి ని పూజ సామాగ్రి దుకాణములో ముందుగానే తెచ్చుకొని అమర్చి పెట్టుకోవాలి.
ముందుగా తెచ్చి ఉంచుకొన్న పూర్ణాహుతి సామగ్రి ని నాలుగు భాగములు గా విభజించి ఉంచుకొనాలి. అచట కూర్చొని ఉన్న అందరూ సభ్యులు పూర్ణాహుతి సామగ్రిని ముట్టుకొని నమస్కరించిన పిదప, హోమం చేస్తున్న వ్యక్తి వారందరి తరఫున “ పూర్ణాహుతిని శ్రీ కాలభైరవునికి సమర్పణ చేసుకొంటున్నాము” అని తెలిపి సామగ్రి లో ఒక భాగం తీసుకొని అగ్నికి ఆహుతి చేయాలి. అచట ఉన్న వారందరూ ముక్త కంఠము తో “ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః “ అని ఉచ్చరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇదే విధముగా అగస్త్యుల వారికి, ఆది శక్తికి, ఆదిశివునికి విడివిడిగా పూర్ణాహుతులు సమర్పణము చేసుకోవాలి.
తరువాత, హోమంలో అగ్ని అణిగిపోయే వరకు, పూజలో పాల్గొన్న వారందరూ కళ్ళు మూసుకుని సద్గురు అగస్త్య మహర్షిని ఒక ఘడియ కాలం పాటు (24 నిమిషాలు) ధ్యానిస్తూ కూర్చొనాలి.
అటుపిమ్మట, త్రిభుజాకారం లో ఏర్పరిచిన దీపాలకు. అగస్త్య మహర్షి చిత్రపటానికి కర్పూర నీరాజనం ఇచ్చి, అగస్త్యుల వారి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందండి.
ఆఖరుగా, పూజకు హాజరైన వారందరికీ అక్కడ ఉంచిన నీటిని, ఆహార పదార్థాలను, ఫలములను ప్రసాదంగా పంచిపెట్టండి. ఆ రాత్రికి సమీపంలో ఉన్న వృద్ధాశ్రమాలకు, మరియు గోశాలకు వెళ్లి ఆహారాన్ని పంచండి.
ఇపుడు "ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః " అని ఉచ్చరిస్తూ రక్షా దారాన్ని విప్పి జలములలో విడిచిపెట్టి దీక్ష విరమించుకొనండి.
Frequently Asked Questions
1. ఆత్మ గాయత్రీ వ్రతం మన ఇళ్ల నుంచే ప్రారంభించవచ్చా?
వినాయకుని ఆలయానికి వెళ్లి ఆత్మ గాయత్రీ వ్రతం ప్రారంభించడం చాలా ఉత్తమము, అయితే, అలా చేయలేని వారు తమ ఇంటిలో పసుపు గణపతిని ఉంచి పూజ చేసుకొని కూడా నోమును ప్రారంభించవచ్చు.
2. త్రిభుజాకార దీపాలకు ఆసనంగా చెక్క పలకను మాత్రమే ఉపయోంగించవలెనా?
చెక్క పలకను ఉపయోగించలేని వారు ఇంట్లో పూజకు ఉపయోగించే ప్లేట్ లేదా అరటి ఆకులను కూడా ఉపయోగించుకొన వచ్చు.
3.ఆత్మ గాయత్రీ వ్రతం ఏ సమయంలో ప్రారంభించాలి?
సూర్యోదయం తర్వాత ఉదయ వేళలో ఈ నోమును ప్రారంభించటం ఉత్తమం.
4. గీయవలసిన త్రిభుజం యొక్క ఏదైనా కొలత ఉందా?
మూడు బిందువులను ఉంచి బియ్యం పిండి తో త్రిభుజాకార ఆకృతి గీచుకోవాలి ఎటువంటి కొలతలు లేవు, అయితే, నీటిని తీసుకొని త్రిభుజాకార ఆకారం మధ్యలో ఉంచాలి, కాబట్టి త్రిభుజం యొక్క పరిమాణాన్ని తగినట్లుగా నిర్ణయించండి.
5. ప్రతిరోజూ ముక్కోణపు దీపం వెలిగించే ముందు ఆ స్థలాన్ని నీటితో శుద్ధి చేయాలా?
అవును, ప్రతిరోజు ఆత్మ గాయత్రీ వ్రతాన్ని ఆచరించే ముందు, ఆ స్థలాన్ని శుభ్రం
చేసి, ఆపై పూజ ప్రారంభించండి.
6. దీపాలు ఎంత సేపు వెలగాలి?
దీపంలో ఒకసారి పోసిన నూనె అయిపోయే వరకు దీపం వెలిగిస్తే సరిపోతుంది.
7. ఆత్మగాయత్రి నోము చేసుకొనేవారు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఏమి చేయాలి?
దీక్ష చేయలేని రోజుల్లో మనస్ఫూర్తిగా మనసులో దీపాలు వెలిగించి ప్రార్థనలు చేయండి.
8. 48 రోజులలో ఏదైనా ఒక రోజు నేను పొరపాటున చేయక పోయినచో ఏమగును?
మరుసటి రోజు నుండి సజావుగా కొనసాగించండి.
9. ఆత్మ గాయత్రి వ్రతం సమయంలో నేను మద్యం సేవించవచ్చా? మాంసం తినవచ్చా?
కూడదు. ఖచ్చితంగా ఆ వస్తువులు నిషిద్ధం
10. ఆత్మ గాయత్రీ వ్రతం కోసం, మట్టి కుండ మాత్రమే ఉపయోగించాలా?
మీకు మట్టి కుండ లేకపోతే, మీరు ఏదైనా ఇతర పాత్రను ఉపయోగించవచ్చు.
11. బహిష్టు సమయంలో ఆత్మ గాయత్రీ వ్రతం పాటించవచ్చా?
సిద్ధ మార్గంలో దీనికి ఎలాటి పాటింపులు లేవు.
12. నోము చేసుకొనే రోజుల్లో దాంపత్య జీవనం కొనసాగించ వచ్చునా?
దీక్ష గా వ్రతం పూని చేసుకొన్నచో , ఆత్మగాయత్రి వ్రతం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.
13. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయకుండా ఉపవాస మంత్రం పఠించవచ్చా? ఏ సమయాలలో పఠించాలి ?
స్నానం చేయకుండా మంత్రం చదవకూడదు. ఉదయం, సాయంత్రం ఇలా ఏ సమయంలోనైనా మంత్రాన్ని పఠించవచ్చు.
14. ఏ వయసు పైబడిన వారైనా ఈ ఆత్మ గాయత్రీ వ్రతాన్ని ఆచరించచ్చా?
. పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే దీనిని ఆచరించగలరు.
15. మంత్రాన్ని జపించేటప్పుడు కళ్ళు మూసుకోవాలా?
ఎలా అయిన ఫర్వాలేదు. అయితే మంత్రాన్ని పైకి ఉచ్ఛరించాలి .
16. ఉపవాస సమయంలో పాటించాల్సిన ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా??
ఘనాహారాన్ని తగ్గించి, ఫలములు మరి ఫల రసాలు స్వీకరించినచో మంచి ఫలితాలను పొందవచ్చు.
17. దీపాలకు రోజూ ఏయే పండ్లు సమర్పించాలి?
కేవలం రెండు అరటిపండ్లు సమర్పించినా మంచి ఫలితాలు వస్తాయి. మీ సౌకర్యాన్ని అనుసరించి ఏదైనా సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించండి.
18. ఆత్మ గాయత్రి వ్రతం ప్రారంభించడానికి గుడికి వెళ్ళే ప్రతి వ్యక్తి విడివిడిగా త్రిభుజాకార దీపాలు వెలిగించాలా?
అవును, ప్రతి వ్యక్తి విడివిడిగా త్రిభుజాకార దీపాలను వెలిగించాలి.
19. భృంగరాజ్ లేదా గుంటగలగరాకు మూలికను ఎలా తినాలి?
భృంగరాజ్ లేదా గుంటగలగరాకు మూలికను ఆకుగా, పొడిగా లేదా కషాయంగా తీసుకోవచ్చు. అయితే, అరుట్ పెరుంజ్యోతి శ్రీ వళ్ళల్ పెరుమాళ్ భృంగరాజ్ మూలికను ఉపయోగించి "జీవకారుణ్య శుద్ధి" అనే ఔషధాన్ని తయారుచేసే అద్భుతమైన పద్ధతిని అందించారు. అన్బాలయం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకొని ఉపయోగించుకోండి.
20. చేతిలో నీటిని తీసుకుని త్రిభుజాకారంలో ఆ నీటిని విడిచిపెట్టినపుడు ఒకవేళ దీపాలు ఆరిపోతే ఏమి చేయాలి?
త్రిభుజాన్ని కొంచెం పెద్దది గా గీసుకొన వచ్చును. లేదా నీళ్లు విడిచే ముందు దీపాలను కొంచెం పక్కకి పెట్టుకొని చేయ వచ్చును. ఒక వేళా దీపాలు ఆరిపోయినా ఫర్వాలేదు మరల వెలిగించుకోవచ్చును.
21. పూజలో రోజూ ఉపయోగించే అక్షింతలు ఏం చేయాలి?
నోము పూర్తి అయిన తర్వాత మీరు వండుకునే బియ్యం తో పాటుగా ఈ అక్షతలు కూడా చేర్చి వండుకొనవచ్చును.
22 దీపాలను వెలిగించుటకు ఒక నిర్దిష్టమైన నూనెనే వాడాలి అనే నిబంధన ఏదైనా ఉన్నదా?
అలా ఏమి నిబంధన లేదు. కానీ స్వచ్ఛమైన గానుగ నూనెను (cold pressed oil) వాడినచో మంచి ఫలితం ఉండగలదు.
23. ఉపవాసం రోజు ఆత్మ గాయత్రీ మంత్రం ముద్రించిన కార్డు ఎవరికైనా ఇవ్వడం మరచిపోతే ఏమి చేయాలి?
చింతించకండి, మరచిపోయిన రోజుతో సహా మరుసటి రోజు, మంత్రం ముద్రించిన కార్డులను ఇవ్వండి. వీలయినంత ఎక్కువ మందికి ఇవ్వండి
24. నా ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు గుడికి వెళ్లి ఆత్మ గాయత్రీ మంత్రాన్ని క్రొత్త వ్యక్తులకు ఉపదేశించలేకుంటే ఏమి చేయాలి?
మొబైల్ ఫోన్ ద్వారా, అతను తన దగ్గరి బంధువులకు ఉపదేశించ వచ్చును., ఎంత ఎక్కువ మందికి ఆత్మగాయత్రి మంత్రం ఉపదేశించగలడో అంత ఎక్కువ ఫలితము.
25. విదేశాలలో నివసించే మేము అగ్నిని వెలిగించి (హోమం) గురుపూజ చేసుకోలేని పరిస్థితి ఉన్నచో, మేము ఏమి చేయాలి?
త్రిభుజాకారం మధ్యలో ఒక పాత్రలో అగ్నిని వెలిగించి లేదా ఒక దీపాన్ని వెలిగించి , దాని సమీపంలో కూర్చుని ఒక ఘడియ కాలం పాటు (24 నిముషములు) ఆత్మగాయత్రి మంత్రం జపించి, గురువుకు కృతఙ్ఞతలు తెలుపుకొని పూర్తి చేసుకొనవచ్చును.
సద్గురు శ్రీ అగస్త్య మహర్షుల వారు అనుగ్రహించిన ఆత్మ గాయత్రి నోము యొక్క ఫలితములు
ఆత్మ గాయత్రి నోమును ప్రేమతో సంతోషంతో ముందుకు వచ్చి స్వీకరించేవారు; ఉత్సాహంతో, భక్తి తో నోమును మొదలుపెట్టి , నేను చెప్పిన విధానాన్ని అనుసరించి పూర్తి చేసుకున్నవారు; పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది, భగవంతుని తెలుసుకొని , కలిసిపోయే భాగ్యాన్ని పొందగలరు.
ఎవరైతే ఆత్మగాయత్రి నోమును సంతోషంతో స్వీకరిస్తూ ఉన్నారో, వారంతా సంపూర్ణమైన ముక్తికి మార్గాన్ని తెలిసినవారై ఉంటారు. ఆదిశివుని సంపూర్ణ కరుణాకటాక్షములను పొందగలరు. అంతరంగ ప్రయాణంలో విజయవంతం కాగల భాగ్యాన్ని పొందగలరు.
ఎవరైతే సంతోషంతో నోమును స్వీకరించి, భక్తి తో శరణాగతి తో దానిని నెరవేరుస్తూ ఉన్నారో , వారి యొక్క అంతరంగ ఉద్దేశ్యము దైవకార్యమును స్వీకరించుటకే అయిఉన్నది. ఈ నోమును ఆచరించే మానవ ఆత్మలు "మానవజాతి వర్ధిల్లాలి, ఆత్మలు విడుదల పొంది, పైకి వెళ్ళాలి" అనే ఉన్నత ఉద్దేశ్యమును సులభముగా పొందగలరు. అంతరంగ జీవితం ఉన్నతమయ్యే కొలదీ భౌతిక జీవితము కూడా శ్రేష్ఠముగా నడుచును.
భావపూర్వకముగా, తన చుట్టూ ఉన్న మానవ ఆత్మలచే 'ఆత్మగాయత్రి' మంత్రాన్ని చెప్పించి, వారిని మేలుకొలిపే వారికి, ఆది శక్తి యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం లభించును. శక్తి యొక్క ఆశీస్సులు లభించినచో, మానవుల కదలికలు కూడా పూర్ణత్వము పొందును. అంతరంగ జీవితము, భౌతిక జీవితము శక్తి యొక్క శక్తుల వలన వికాసం పొందును.
తమ అవసరాలన్నియు పూర్తిగా తీరిపోవుటను , తమ యొక్క అనేక కర్మల ముద్రలు పరిష్కరించబడుటను గమనించగలరు. ఆంతరంగిక సంపద, భౌతిక పర మైన సంపదలను కూడా పొందగలరు.
అంతరంగంలో ఆత్మ కాంతి పెరిగి, మనసు ఆ కాంతి చే ఆకర్షించబడి, లయం చెందును. భౌతికపరమైన కదలికలు సంపూర్ణముగా వికసించి, మనసు ఆనందించే విషయములు జరుగగలవు.
ప్రతి ఒక మానవ ఆత్మను మేలుకొలుపుట అన్నది ఒకటే ఉన్నతమైన దైవ కార్యం కాగలదు. నా ప్రియమైన శిష్యులు, దైవముల యొక్క యుగమార్పు పనిలో పూర్తి సహకారాన్ని అందించుట ద్వారా దేవతా పదవులను పొందగలరు.
నా ప్రియ శిష్యుల ద్వారా నా యొక్క లైట్ బ్రిడ్జి తో అనుసంధానం చేయబడిన వారంతా అజ్ఞానపు తెర తొలగి, ఈశ్వరుని యొక్క పరలోకములో ప్రవేశించే భాగ్యాన్ని పొందగలరు.
నా ప్రియమైన శిష్యులు ఇతర మానవ ఆత్మల కు ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉపదేశించి, తద్వారా వారిని జాగృతం చేసినచో, నా లైట్ బ్రిడ్జి తో పెనవేయబడి, వారి వారి అనుకూల దైవముల లైట్ బ్రిడ్జి లతో కూడా అనుసంధానించబడి, సులభముగా ముక్తిని పొందగలరు.
నా ప్రియ శిష్యుల ద్వారా క్రొత్తగా లైట్ బ్రిడ్జి తో కనెక్ట్ చేయబడిన ఆత్మలు, ఒకానొక అయస్కాంత శక్తి నిండిన ఆకర్షణ శక్తి ని అనుభూతి చెందగలరు. అంతేకాక, తమ బాహ్య జీవనంలో అనేకములైన విఘ్నములు తొలిగిపోవుటను కూడా చూస్తారు. వారి అంతరంగ జీవితము పూర్తిగా తెరుచుకొనును. వారి ఆత్మ ఈశ్వరుని వైపు ప్రయాణించుటకు ప్రారంభించును. దానికి తగినట్లుగా భౌతిక జీవితంలో నెరవేరని కొన్ని స్థితులు సులభముగా నెరవేరగలవు. ఆంతరంగిక సంపద పెరిగినచో, భౌతిక సంపద కూడా పెరుగగలదు. స్వీకరించే వారందరూ ఒక నూతన పరిణామములో వికాసాన్ని పొందగలరు. ప్రళయకాల వినాశనములనుండి కూడా కాపాడబడగలరు.
ఆదిశక్తి చే తెలుపబడిన "ఆత్మగాయత్రి నోము" ఫలితములు
కలి అంతరించబోతున్నది; వినాశనం ఆరంభం అయినది; ప్రళయం సమీపిస్తూ ఉన్నది; అని భగవంతుడు చేస్తున్న అనేక హెచ్చరికలు మానవుల బుద్ధిని స్పృశించుట లేదు. దానికి కారణం బుద్ధి పై చేరియున్న అనేకమైన కర్మల ముద్రలే. వీటన్నిటి నుండి రక్షించే ఒకే ఒక అద్భుతమైన ఆయుధం అనేది అగస్త్యుల వారిచే అనుగ్రహించబడిన మంత్ర శబ్దములే.
ఎటువంటి బలమైన శ్రవణేంద్రియపు తెరనైనా కూడా భేదించగల మహా శక్తిశాలి ఆయుధం శ్రీ అగస్త్యుల వారిచే అనుగ్రహించబడిన ఆత్మగాయత్రి మంత్రము అయిఉన్నది. భగవంతుని పిలుపు మారుమ్రోగుతున్నది అంటే, కాలము యొక్క గడువు ముగిసిపోయినది అని అర్థము. మానవ ఆత్మల చెవులలో ఈ మంత్రం వినిపించిన వెంటనే, అనేక మందికి అంతర్శ్రవణేంద్రియాలు (inner ears) బలంగా తెరుచుకొనబడగలవు. భూమికి వ్యతిరేక దిశలో నుండి వచ్చే శబ్దములు కూడా వినగలుగుతారు. శబ్ద సహాయముతో విశ్వమునకు ఆధార స్థితులను తెలుసుకొన గలరు.
కాబట్టి , కలియుగాన్ని పూర్తి చేసి సత్యయుగానికి నాంది పలికే అద్భుతమైన మంత్రం ఆత్మ గాయత్రీ మంత్రం. ప్రియమైన శిష్యులందరు ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉచ్చరించినపుడు వారి అంతర్శ్రవణేంద్రియాలు తెరుచుకొనుటను అనుభూతి చెందగలరు. వారు ఇతరులకు వినిపించేటపుడు కూడా మంచి ఫలితములను
పొందగలరు. చెవుల్లో ప్రతిధ్వనించే ఈ మంత్ర పదాలే ఆత్మలను ఆకర్షించి వాటిని లైట్ బ్రిడ్జికి అనుసంధానం చేసి పైకి వెళ్లేందుకు సహకరిస్తాయి. మానవ ఆత్మలను దయతో రక్షించడానికి దైవిక శక్తులు పుంజుకునే సమయం ఇది.
అగస్త్యులవారి దయవలన ఆత్మలు తేరుకుంటున్నాయి ; విముక్తి పొందుతున్నాయి ; కాబట్టి అందరూ గ్రహించి పని చేయాలి. ఆత్మగాయత్రీ మంత్రాన్ని మండల కాలం పాటు ఎడతెగకుండా జపించే వారు తమ అంతర్శ్రవణేంద్రియములు తెరుచుకొని, ఆత్మలోని ప్రకాశాన్ని దర్శించగలరు. ఆత్మ మాట్లాడే ప్రేమ భాషని వినగలడు. అయితే ఇది తెలుసుకోవటం ఎలా? ప్రతిదినము మీ చెవులని తాకి లోపలి వెళ్లే పదములను ఏకాగ్రతతో గమనించండి. అవి అన్నియు చెవులకు విందుకొలిపే లాగున ఉంటాయి.
ఒక ఔషధముగా, ఆనందాన్ని త్రాగించే పలుకులు లోపలకు వెళుతున్న అనుభూతిని పొందగలరు. ఆత్మబలం పెరుగగలదు. ప్రాణము మరియు దానిని ఆశ్రయించి ఉన్న శరీరము రెండును ప్రకాశించగలవు.
ఆత్మ గాయత్రీ మంత్రాన్ని ఆరాధించి, పూజించే వారు తమ జీవితంలో వివిధ మార్పులను ఏర్పడి, జీవితం వికసించినట్లుగా అనుభూతిని పొందుతారు. ఏ క్రియనైనా స్పృహతో స్వీకరించి, చేసే వారు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలరు.
మీచే మంత్రం బోధించబడిన ఆత్మలు కూడా ప్రయోజనం పొందుతాయి. వీటి వల్ల కలిగే లాభాలేంటో తెలియాలంటే ప్రళయ కాలం మరింత బలపడే వరకు ఆగాల్సిందే. రక్షించబడిన ఆత్మలు సత్యాన్ని గ్రహించగలరు.
చేసే ప్రతి పని గొప్ప ఫలితాన్నే ఇస్తుంది . కరుణతో ఒక తల్లి వంటి మనసుతో మీరందరు కలిసి అనేక ఆత్మలను మేలుకొలిపి కడతేర్చే దైవకార్యాన్ని చేయండి.
ఆదిశివునిచే తెలుపబడిన "ఆత్మగాయత్రి నోము" ఫలితములు
విధ్వంసం కోసం ఎదురుచూసే స్థితిని, దానిని గ్రహించలేని స్థితి ఏర్పడి ఉన్న ఈ కలియుగ సరిహద్దు కాలంలో, మానవులను మేలుకొల్పుట ఒకటే గొప్ప ఫలితములను ఇవ్వగలదు. జాగృతి చెందిన మానవులందరు ఒకటిగా చేరి, దీనిని అర్థం చేసుకోలేని ఆత్మలను విడుదల పొందేలా చేయవలసి ఉన్నది.
వివిధ మార్గాలలో ముక్తి పొందుటకై ప్రయాణించేవారు కూడా ఒక్కసారి అగస్త్యులవారి 'ఆత్మగాయత్రి' మంత్రాన్ని స్వీకరించి జపించినచో, వారి వారి గమ్యం యొక్క సరిహద్దును సులభముగా చేరిపోగలరు.
దైవకార్యం తీసుకొని చేసేవారంతా దైవములచేతనే స్తుతించబడుతారు. మహోన్నతమైన దైవ కార్యాన్ని స్వీకరించి, పనిచేసే అగస్త్య భగవానుని సేవకులు చేసే పనియే అత్యుత్తమమైన పని అయిఉన్నది. అగస్త్యుని దాసులకే నేను దాసుణ్ణి అవుతాను. ఎందుకంటే, మానవ ఆత్మలను రక్షించడానికి మహానుభావుడైన అగస్త్యుని చే రూపొందించబడిన మహోన్నత దైవకార్యమే ఈ ఆత్మగాయత్రి నోము అయిఉన్నది.
ఈ మంత్రము మనసు ఒదిగిపోవుటకు, శాంతించుటకును సహాయపడును. ప్రాణానికి 'నమ్మకము' ను ఇచ్చును . "మనం వినాశనం నుండి రక్షించబడగలము" అనే సత్యాన్ని జీవులు గ్రహించగలుగుతారు.
నైతికతలు పెరుగును; మంచి గుణములు వెలిపడును; వినాశనం నుండి కాపాడబడే ఆత్మలు తమ అంతర, బాహ్య అవసరములు తీరిపోతున్నట్లుగా గమనించగలరు.
భ్రాంతులు తొలగుటకు, మానవత్వం మేలుకొనుటకు, ఆత్మలు ఈశ్వరుని చేరుటకును, అందరు ప్రయత్నపూర్వకంగా పనులు చేస్తూ , ఇతరులను ప్రేరేపించుటకు కూడా ప్రయత్నములు చేయవలసి ఉన్నది.
దీనికన్నా ఒక సులభ సాధ్యమైన మార్గము మానవ జాతికి చూపుట ఎవరివల్లనూ సాధ్యము కాదు " అని గ్రహించి, శరణాగత స్థితిలో ఎదిగి ఉన్న దాసులకు నేను దాసునిగా ఉంటాను
ఒక మానవుడు దేవుని ఎటువంటి సహాయాన్ని అందించగలడు?
ఇతరుల ద్వారా తెలుసుకున్నవి, సంఘటనలకు సాక్ష్యంగా ఉన్న వారి ద్వారా తెలుసుకున్నవి ఒకటి గా కలుపుకొని ఇతిహాసాలను, కావ్యాలను రచించవచ్చును. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం కూడా దైవ కార్యమే. అయితే, తెలుసుకుని చేయండి. ప్రయకాలంలో నాశనం అగుటకు కాచుకొని ఉన్న మానవ ఆత్మలకు అన్నం పెట్టుటకంటెను, జ్ఞానాన్ని బోధించుట కంటెను, వారిని మేలుకొలిపి పైకి పంపి ఉద్ధరించుటయే అత్యంత గొప్ప సహాయము కాగలదు. కలి సరిహద్దు అనబడే ఈ ప్రళయ కాలంలో ఆత్మలు కాపాడబడుటకై చేసే ప్రార్థనలు అత్యున్నతమైన దైవ కార్యమగును
ఆత్మ గాయత్రి నోన్పు కోటి పొందండి కరుణ అంగడిలో ద్వారా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినవారికి త్వరలో పోస్టల్ ద్వారా పంపబడుతుంది.
9789032199 l 9361047636 l 7996774757 l 9944170454