శ్రీ చక్రమును, ఆత్మలింగమును ప్రతిష్ట చేసే విధానము (మొదటి రోజు)


1. పసుపు తో ఆది మూల గణపతి ని చేసి, ఆయనను ఒక ఆసనం పై నిలిపి, మీ అరచేతి లో కొంచెం నీటి ని తీసుకొని, "ఓం గం గణపతయే నమః " అని మూడు సార్లు పలికి పూజలో, సాధనలో ఎటువంటి విఘ్నములు రాకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఆ నీటిని నేలపై విడిచిపెట్టాలి. అటు తర్వాత "గణపతి కాపు " మంత్రాన్ని మూడు సార్లు పఠించాలి.

2. ఏదైనా ఒక తాంబూల తట్ట లో కానీ లేదా ఒక ఆసనం పై ఒక చతురస్రాకారపు చెక్క పలక ను ఉంచి, దానిపై శ్రీ చక్రపు రేకును ఉంచాలి.  శ్రీ చక్రాన్ని నీరు, పలు, ఫల రసములతో , సుగంధ ద్రవ్యములతో అభిషేకించాలి. తరువాత, ఒక శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని తీసుకొని దానితో శ్రీ చక్రాన్ని, చెక్క ముక్కను తుడుచుకోవాలి.

3. ఒక చెక్క టేబుల్ కానీ పీట కానీ ఉంచి దానిపై అభిషేకం చేసి ఉన్న చతురస్రాకారపు చెక్క ముక్కను ఉంచి , దానిపై శ్రీ చక్రాన్ని అమర్చండి.

4. కొంచెం పసుపు కుంకుమ లను తీసుకొని శ్రీ చక్రం మధ్యలో ఉంచి, నమస్కరించుకొనండి. పిమ్మట, మీరు పూజించుకొని ఉన్న మీ ఆత్మలింగమును శ్రీ చక్రము మధ్యలో ఉంచి, దానిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించండి.

5. శ్రీ చక్రం యొక్క నాలుగు మూలలా పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరించుకొనాలి. తొమ్మిది అక్షింతలను తీసుకొని నాలుగు మూలలా వేసి, శ్రీ చక్ర ప్రతిష్టను పూర్తి చేయండి.

ఒకసారి శ్రీ చక్రాన్ని ప్రతిష్ట చేసి, దాని మధ్యలో మీ ఆత్మలింగాన్ని ప్రతిష్ట చేసాక, మరల శ్రీ చక్రాన్ని శుభ్రం చేసి, క్రొత్తగా పసుపు కుంకుమలను , పువ్వులను, అక్షింతలను వుంచటమో, మధ్యలో ఉన్న ఆత్మలింగాన్ని తీసి శుభ్ర పరచడమో చేయరాదు. పైన తెలిపిన పద్ధతిని ఒకే ఒకసారి మాత్రమే చేయాలి.